![]() |
![]() |

చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలాదిత్య ఆడియన్స్ కి బాగా పరిచయమే. "చంటిగాడు" మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత "1940లో ఓ గ్రామం" అనే మూవీ చేసాడు కానీ తనకు అనుకున్నంత క్రేజ్ రాలేదు.
తర్వాత కొంతకాలం స్మాల్ స్క్రీన్ మీద యాంకర్‌గా చేసాడు. ఇక ఆ తర్వాత జాబ్ చేసుకుంటూ తన లైఫ్ లో బిజీ ఐపోయాడు. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాడు..హౌస్‌లో బాలాదిత్య ఆటతీరు, ప్రవర్తనకు ఎంతో మంది ఫాన్స్ ఫిదా ఇపోయారు. ఇక బాలాదిత్య బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు అతడి భార్య.. రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో బాలాదిత్య హౌస్‌లోకి వెళ్లాల్సి రావడంతో తన కూతురికి నామకరణ వేడుక చేయలేకపోయాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాకా మంచి ముహూర్తం చూసుకుని రీసెంట్ గా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకున్నాడు.
ఇక ఈ ఫంక్షన్ కి బిగ్‌బాస్ సీజన్ 6 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు. ఆర్జే సూర్య, గీతూ, ఇనయా, ఆరోహిరావు, వాసంతి ఇలా చాలా మంది ఇక్కడ సందడి చేశారు. ఇక కుమార్తెకు యజ్ఞ విధాత్రి అని పేరు పెట్టాడు బాలాదిత్య.
![]() |
![]() |